Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఆరోగ్యoచెత్తాతో కంపుకొడుతున్న కాలనీలు..

చెత్తాతో కంపుకొడుతున్న కాలనీలు..

📰 Generate e-Paper Clip

  • జవహర్‌నగర్‌ డివిజన్‌లో పారిశుధ్య సమస్యపై కాలనీవాసుల ఆవేదన

జవహర్‌నగర్‌, ( ప్రభంజనం ):

ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో జవహర్‌నగర్‌ డివిజన్‌లోని పలు కాలనీలు కంపుకొడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను రోడ్లపై విచ్చలవిడిగా వేయడంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు పారిశుధ్య సమస్య తీవ్రంగా మారుతోందని వారు పేర్కొంటున్నారు. జవహర్‌నగర్‌లోని మారుతినగర్‌ రోడ్‌ నంబర్‌ 3లో రోడ్లపైనే పెద్దఎత్తున చెత్తాచెదారం వేస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపిస్తోంది. చెత్తకుప్పల కారణంగా వీధికుక్కలు గుంపులుగా చేరుతున్నాయని, దీంతో కుక్కల దాడులు కూడా పెరుగుతున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పారిశుధ్యం సమస్యను తీర్చాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.