- నటి భాగ్యశ్రీ బోర్సే చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం
- శాంతినగర్‌లో సరికొత్త షాపింగ్ అనుభూతి..
- పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, (ప్రభంజనం):
శాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటి భాగ్యశ్రీ బోర్సే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మాల్‌లోని వివిధ వ్యాపార విభాగాలను సందర్శించి, వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికి, మాల్‌లో అందుబాటులో ఉండే షాపింగ్ సదుపాయాలను వివరించారు. కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త షాపింగ్ కేంద్రం అందుబాటులోకి రావడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాల్ నిర్వాహకులు, వ్యాపార ప్రముఖులు, స్థానిక ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భాగ్యశ్రీ బోర్సే హాజరుతో కార్యక్రమం సందడిగా సాగింది. శాంతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒకే చోట విభిన్న షాపింగ్ సదుపాయాలను అందించడమే లక్ష్యంగా జీవీ మాల్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


