Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaవరంగల్వేయి స్తంభాల దేవాలయంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రారంభం..

వేయి స్తంభాల దేవాలయంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రారంభం..

📰 Generate e-Paper Clip

  • ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు

హనుమకొండ:(ప్రభంజనం )

చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో ప్రతిష్ఠించిన మహా గణపతి నవరాత్రి ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా అధికారికంగా ప్రారంభించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన సతీమణి నీలిమ రాజేందర్ రెడ్డితో కలిసి వేయి స్తంభాల దేవాలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ, ఈఓ డి. అనిల్ కుమార్, ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గట్టు. మహేష్ బాబు, యువ నాయకుడు దేవర విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ఆలయ మండపంలో కొలువుదీరిన మహా గణపతిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకున్నారు. తదుపరి చారిత్రక రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా గణపతికి శాస్త్రోక్తంగా పూజలు చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మతసామరస్యంతో లోక కళ్యాణం ఆ మహాగణపతిని పూజించడం వలన ప్రకృతి సహకరిస్తుందని, ప్రకృతిని ప్రేమించు పర్యావరణాన్ని రక్షించు అనే భావనతో భక్తులు పూజలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని భక్తులకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.