Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaహైదరాబాద్గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

📰 Generate e-Paper Clip

  • శేరిలింగంపల్లి నాయకుడికి టీఆర్ఎస్ చీఫ్ అరుదైన అవకాశం

సిటీ బ్యూరో: ( ప్రభంజనం )

తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ వర్గ ఇంఛార్జీగా ఉన్న వాసిలి చంద్రశేఖర ప్రసాద్ కు మరో అరుదైన అవకాశం లభించింది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా తనను గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.
రాబోయే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మూడు కార్పొరేషన్లలో విజయం సాధించేలా తన వంతు కృషి చేస్తానని వాసిలి తెలిపారు. మెజారిటీ కార్పొరేటర్ స్థానాలను గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీకి బలమైన సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసి, ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ తెలిపారు. పార్టీ అధ్యక్షురాలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.