Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeజాతీయoGold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.1.58 లక్షలు దాటిన పసిడి

Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.1.58 లక్షలు దాటిన పసిడి

📰 Generate e-Paper Clip

బిజినెస్ డెస్క్,( ప్రభంజనం ):  దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలకు బలమైన మద్దతు లభించడంతో దేశీయంగా కూడా బంగారం రేట్లు పైకి కదిలాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.58 లక్షల స్థాయిని దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఇటీవల గణనీయంగా పెరగడం ఈ దూకుడుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది.

డాలర్‌ బలహీనత.. బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గుదల

బంగారం ధరల పెరుగుదలకు ప్రధానంగా అమెరికా ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం, డాలర్‌ విలువ బలహీనపడటం ప్రభావం చూపాయి. అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక రుణాల బైబ్యాక్‌ కార్యకలాపాలను పెంచనున్నట్లు ప్రకటించడంతో బాండ్‌ ఈల్డ్స్‌పై ఒత్తిడి ఏర్పడింది. దీంతో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.

హైదరాబాద్‌ లోనూ పెరుగుదల..

గురువారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.4300 మేర పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,46,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.3950 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలోకు రూ.10 వేల మేర పెరుగుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.6 లక్షలుగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.