Wednesday, September 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeకేపీహెచ్‌బీలో చోరీ.. పాత నేరస్థుడు అరెస్ట్‌

కేపీహెచ్‌బీలో చోరీ.. పాత నేరస్థుడు అరెస్ట్‌

📰 Generate e-Paper Clip

కూకట్ పల్లి( ప్రభంజనం): కేపీహెచ్‌బీ కాలనీలో ఇంట్లో ల్యాప్‌టాప్‌, మొబైల్‌ చోరీ చేసిన పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీనగర్‌కు చెందిన పాటిల్‌ సందీప్‌ (27)ను సీసీఎస్‌ కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ క్రైమ్‌ టీమ్‌ సంయుక్తంగా అరెస్ట్‌ చేసింది. ఈ నెల 29న కేపీహెచ్‌బీ ఫేజ్‌-1లో ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో రూ.70 వేల విలువైన ల్యాప్‌టాప్‌, మొబైల్‌ చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి శుక్రవారం లులు మాల్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌, చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనం తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలోనూ పలు చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.