Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డిప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు స్వస్తి పలుకుదాం...

ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు స్వస్తి పలుకుదాం…

📰 Generate e-Paper Clip

  • మట్టి విగ్రహాలనే పూజిద్దాం!
  • ప్రకృతిని కాపాడుదాం… భక్తితో పూజిద్దాం!
  • నీటి వనరులను కాపాడుకుందాం
  • మట్టి వినాయకులనే ప్రతిష్ఠిద్దాం!
  • విజ్ఞాన్ మహిళా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల పర్యావరణ చైతన్యం

ఘట్కేసర్, (ప్రభంజనం)

వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు స్వస్తి పలికి మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని మాజీ కౌన్సిలర్ బేతాల నర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ డివిజన్ ఈడబ్ల్యుఎస్ కాలనీ బస్‌స్టాప్ సమీపంలో ‘స్ఫూర్తి ఆర్గనైజేషన్’ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొండాపూర్ విజ్ఞాన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థినులు స్వయంగా తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను స్థానిక ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా బేతాల నర్సింగ్‌రావు, బర్ల రాధాకృష్ణ మాట్లాడుతూ… పండుగల పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేయకుండా, సంప్రదాయాలను ప్రకృతికి అనుకూలంగా కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరుల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. అనంతరం స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి మాట్లాడుతూ.. భక్తి మనసులో ఉండాలి, పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత కావాలి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థినులు స్వయంగా మట్టి ప్రతిమలను తయారు చేసి పంపిణీ చేయడం ద్వారా సమాజంలో పర్యావరణహిత వినాయక చవితిపై గొప్ప చైతన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శేషి కుమార్, కంది లింగం, భూషణం, కె. రాజేందర్ రెడ్డి, కిరణ్, బాలకృష్ణలతో పాటు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు ప్రవళిక, మౌనిక, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.