- చందానగర్ పీజేఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహం వద్ద కరపత్రల ఆవిష్కరణ
- సిఐటియు శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ
శేరిలింగంపల్లి : ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించే జైలుభరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కొంగరి కృష్ణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు 10న అన్ని జిల్లా కలెక్టరేట్లముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ మరోవైపు అమెరికాతో రైతాంగాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా ఒప్పందాలను కుదిరించుకుందని ఆయన అన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి వస్తే ఇక్కడ ఉన్న రైతాంగం పూర్తిగా అప్పులో కూరుకుపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు సైతం పనిలేకుండా పోతుందని ఆయన గుర్తు చేశారు. వెంటనే కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.


