Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeనిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం..

నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం..

📰 Generate e-Paper Clip

  • ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి

నిజామాబాద్ ప్రతినిధి: ( ప్రభంజనం )

నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సతీష్ తన సర్వీస్ వెపన్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. సతీష్ ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ పూర్తి చేసుకుని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి వచ్చారు. అనంతరం తన సర్వీస్ వెపన్‌ను శుభ్రం చేస్తున్న సమయంలో అది అనుకోకుండా పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనాస్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుపాకీ ప్రమాదవశాత్తు ఎలా పేలింది, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.