Wednesday, September 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ కీలక భేటీ.. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు

రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ కీలక భేటీ.. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం భేటీ కానున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమావేశం కానున్నారు.

ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఇటీవల రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యవహారాలపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానుంది

క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై అధిష్టానం పెద్దలతో చర్చించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.