
యాదగిరిగుట్ట (ప్రభంజనం): కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడి నివాసంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ యాదగిరిగుట్టలో బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మంగళవారం స్థానిక బస్టాండ్ ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు. బీజేపీ శ్రేణులపై దాడికి తెగబడితే ఊరుకునేది లేదని, ప్రజా వ్యతిరేక విధానాలను మున్ముందూ ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు గుంటుపల్లి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు భువనగిరి శ్యాంసుందర్, బెల్దే అశోక్, బందారం మల్లేష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆకుల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, పలుగుల సురేష్, ఉపాధ్యక్షులు ఆలేటి కర్ణ, చిత్తర్ల కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్, సీనియర్ నాయకులు రంగ సత్యం, రవీందర్‌రెడ్డి, లక్ష్మయ్య, నల్ల వాసు, నంగునూరి భాను, శివ, వంశీ, శ్రీశైలం, అజయ్, వినోద్, ఆకుల దేవ, నరేష్, ఉమేష్, శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


