Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaనిజామాబాద్బెలియా తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

బెలియా తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

  • లబ్ధిదారులకు అందజేసిన సర్పంచ్ రావుజి నాయక్

ధర్పల్లి : (ప్రభంజనం)

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండలం బెలియా తండా గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావుజి నాయక్ లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సరుకులు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ కార్డులు అందని కుటుంబాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని సర్పంచ్ రావుజి నాయక్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, లబ్ధిదారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.