Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeభక్తిన్యూ ప్రశాంత్ నగర్ లో ఘనంగా గణేష్ వేడుకలు..

న్యూ ప్రశాంత్ నగర్ లో ఘనంగా గణేష్ వేడుకలు..

📰 Generate e-Paper Clip

  • రూ.52, వేల116 ధర పలికిన
    లడ్డూ

మియాపూర్: ( ప్రభంజనం )

మియాపూర్ న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి 7రోజులు పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిమజ్జనం రోజున గణేష్ లడ్డూ వేలం పాట చేపట్టారు. ఈ లడ్డూను కాలనీ అధ్యక్షులు ఉదయ్ కుమార్ గౌడ్ రూ.52వేల116లకు దక్కించుకున్నారు. ప్రతి ఏటా సంప్రదాయంగా నిర్వహించే వేలం పాటలో లడ్డును కైవాసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఉదయకుమార్ గౌడ్ తెలిపారు. లడ్డు వేలంలో పాడుకోవడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకంతో ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రాంబాబు, రంగారావు, రవీందర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, సుధాకర్ రెడ్డితో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.