- పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే పలువురు ప్రముఖులు
ఉప్పల్, అక్టోబర్ 11, (ప్రభంజనం)
రామంతపూర్ పద్మశాలి సంఘం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్త మార్కండేయ శివాలయ నూతన ఆర్చ్ ( ముఖ ద్వారము ) ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ విచ్చేసి ఆర్చ్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, రామంతపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారు శ్రీవారి వెంకట్రావు, హబ్సిగూడ డివిజన్ అధ్యక్షులు కక్కిరేణి హరీష్, రామంతపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్, రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు వంగాల సంతోష్ గుప్తా, తిండేరు హనుమంతరావు, రామంతపూర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపు శ్రీకాంత్ యాదవ్, మాజీ అధ్యక్షులు వల్లపు జగన్ యాదవ్, గడ్డం సాయికిరణ్, తాళ్ల బాలకృష్ణ గౌడ్, పాల్గొన్నారు.


