Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalకేసీఆర్‌ భూముల వ్యవహారంపై విచారణకు కమిటీ!

కేసీఆర్‌ భూముల వ్యవహారంపై విచారణకు కమిటీ!

📰 Generate e-Paper Clip

  • నలుగురు ఐఏఎస్ అధికారుల నియామకం

తెలంగాణ బ్యూరో: ( ప్రభంజనం )

తెలంగాణలోని పలు జిల్లాల్లో భూములకు సంబంధించిన తీవ్ర అక్రమాలు, అవకతవకలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో శ్రీదేవసేనా చైర్ పర్సన్ గా, రాజీవ్ గాంధీ హన్మంత్, సందీప్ కుమార్ ఝా, అడిషనల్ మెంబర్లుగా కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ కమిటీ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి కే. తారక రామారావు అనుచరులు, సన్నిహితులకు సంబంధం ఉన్నట్లు పేర్కొన్న పలు గ్రామాల్లోని భూముల వ్యవహారాలను కమిటీ పరిశీలించనుంది. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22-ఏపై శాసనసభలో జరిగిన చర్చ అనంతరం ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్లు, భూములపై ఉన్న వివాదాలు, సెక్షన్‌ 22-ఏ కింద నమోదైన అంశాలను కమిటీ పరిశీలించనుంది. కమిటీకి కాలేజియేట్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌ గాంధీ హనుమంతు కన్వీనర్‌గా ఉంటారు. జనగాం జిల్లా కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ సందీప్‌ కుమార్‌ ఝా కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. విచారణకు ఎంపికైన ప్రతి జిల్లాకు చెందిన కలెక్టర్‌ కూడా కమిటీలో సభ్యుడిగా వ్యవహరించనున్నారు. పలు జిల్లాల్లోని భూముల వ్యవహారాలపై సమగ్రంగా విచారణ జరిపి, అందుబాటులో ఉన్న రికార్డులు, రిజిస్ట్రేషన్‌ వివరాలు, సంబంధిత పత్రాలను పరిశీలించి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.