Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeవిలేకరుల ముసుగులో వసూళ్ల కు పాల్పడితే ఊరుకోం..

విలేకరుల ముసుగులో వసూళ్ల కు పాల్పడితే ఊరుకోం..

📰 Generate e-Paper Clip

  • తప్పుడు కథనాలకు చెక్‌ పెట్టండి
  • పోలీసులకు జవహర్ నగర్ విలేకరుల ఫిర్యాదు

జవహర్‌నగర్‌: ( ప్రభంజనం )

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాల పేరుతో కొందరు వాస్తవాలకు విరుద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నారని స్థానిక విలేకరులు మండిపడ్డారు. తోటి విలేకరుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ సైదులును కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. స్థానిక విలేకరులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పరిణామాలు,
విలేకరుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న తీరును ఎస్ హెచ్ ఓ కు వివరించారు. కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి విలేకరుల పేరును ఉపయోగించుకుంటూ ప్రముఖులను కలుస్తున్నారని, కమీషన్ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలతో జర్నలిస్టుల వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక సమాచారం బయటకు..

జవహర్‌నగర్‌లో సేకరించే స్థానిక సమాచారాన్ని బయట వ్యక్తులకు చేరవేస్తూ.. దాని ఆధారంగా కథనాలు రూపొందిస్తున్నారనే ఆరోపణలను కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవాలను నిర్ధారించకుండానే తోటి విలేకరులపై వ్యక్తిగత ఆరోపణలతో కథనాలు ప్రచురించడం, అవమానకరంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన అంశాలతో పాటు విలేకరుల పేరుతో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న వసూళ్ల వ్యవహారంపైనా సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను కోరారు. ఆధారాలు లేకుండా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.