Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalటీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

  • నివాళులర్పించిన గ్రేటర్ హైదరాబాద్ ఇంఛార్జీ వాసిలి

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ ఎస్ ) ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు.
మదీనగూడ డివిజన్‌లోని టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మక్త మహబూబ్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు గుండె దయానంద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే గాంధీ జయంతిని పురస్కరించుకొని మియాపూర్ పరిధిలో పనిచేస్తున్న పలువురు పారిశుద్ధ్య కార్మికులకు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ ఎస్ నాయకులు గుండె దయానంద్ ముదిరాజ్, కుమార్ కురుమ, విష్ణుచారీ, ప్రవీణ్, రాంభూపాల్ రెడ్డి, చంటి, నవీన్, స్వామి గౌడ్, సూర్య ప్రకాష్, లక్ష్మి, మాధవి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.