Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeడా. వ్యాసభట శ్రీవాణి చౌదరికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

డా. వ్యాసభట శ్రీవాణి చౌదరికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

📰 Generate e-Paper Clip

  • హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హెడ్, నేషనల్ సెక్రటరీ డాక్టర్ సత్యనారాయణ
  • ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు

ఉప్పల్, (ప్రభంజనం):

తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. వ్యాసభట్ శ్రీవాణి చౌదరి జన్మదినం సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హెడ్, నేషనల్ సెక్రటరీ డా. దేవరకొండ సత్యనారాయణ (సతీష్) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల కోసం డా. శ్రీవాణి చౌదరి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మానవ హక్కుల పరిరక్షణలో ఆమె మరింత ముందుకు సాగుతూ సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సుదీర్ఘ ఆయుష్షు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు డా. వ్యాసభట్ శ్రీవాణి చౌదరికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా రంగంలో ఆమె చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని జర్నలిస్టులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.