పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆందోళన

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ గర్భిణి యువతి గురువారం పటాన్‌చెరు పట్టణంలోని నాయకోటి బస్తీలో ప్రియుడు శ్రావణ్ ఇంటి ముందు నిరసనకు దిగింది. లింగంపల్లిలోని ఓ క్లినిక్‌లో పరిచయమైన శ్రావణ్ ప్రేమ పేరుతో తనను నమ్మించి, ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిని చేసి వివాహానికి నిరాకరిస్తున్నాడని బాధితురాలు అరుణ ఆరోపించింది.ఈ ఘటనపై ఇప్పటికే పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు ఆమె తెలిపింది. ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం.


