Saturday, August 29, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeసినిమామహేశ్‌ బాబు ‘వారణాసి’ విజువల్స్‌ లీక్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌..!

మహేశ్‌ బాబు ‘వారణాసి’ విజువల్స్‌ లీక్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌..!

📰 Generate e-Paper Clip

  • షూటింగ్‌ దశ నుంచే తప్పించుకోలేకపోతున్న లీకుల బెడద
  • భారీ బడ్జెట్ గ్లోబల్ మూవీపై కఠిన సెక్యూరిటీని కోరుతున్న అభిమానులు

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అంచనాల చిత్రం ‘వారణాసి’కి లీకుల సమస్య వెంటాడుతోంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో వస్తున్న ఈ గ్లోబల్‌ ప్రాజెక్ట్‌ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సుమారు 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. అయితే, ఇటీవల ఈ సినిమా షూటింగ్ సెట్స్‌ నుంచి మహేశ్‌ బాబుకు సంబంధించిన కొన్ని విజువల్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.భారీ బడ్జెట్‌తో, అత్యంత గోప్యంగా తెరకెక్కించాల్సిన ఈ చిత్రం నుంచి వరుసగా విజువల్స్ బయటకు వస్తుండటం అభిమానుల్లో టెన్షన్‌ను పెంచుతోంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ఈ రకమైన లీకులు చిత్ర బృందంతో పాటు ప్రేక్షకులకు కూడా నిరాశ కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పందించి సెట్స్‌లో సెక్యూరిటీని మరింత కఠినతరం చేయాలని, లీకులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూపర్‌స్టార్‌ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.