Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డిసినీ నిర్మాత సి.కళ్యాణ్ మా ప్లాట్స్ కబ్జా చేస్తున్నాడు..

సినీ నిర్మాత సి.కళ్యాణ్ మా ప్లాట్స్ కబ్జా చేస్తున్నాడు..

📰 Generate e-Paper Clip

  • మాదాపూర్ పోలీసు స్టేషన్ లో సియాట్ సొసైటీ అధ్యక్షుడి ఫిర్యాదు

శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )

మాదాపూర్‌లోని సున్నం చెరువు ప్రాంతంలో తమకు చెందిన ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి ఆక్రమణకు ప్రయత్నించారంటూ సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ ఆధ్వర్యంలో ప్లాట్ యజమానులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. సినీ నిర్మాత సి. కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలత తదితరులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్లాట్ యజమానుల వివరాల ప్రకారం.. మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట్, సున్నం చెరువు ప్రాంతంలోని సర్వే నంబర్లు 12, 12ఏ, 13లో తమకు ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి తమకు హక్కులు, పత్రాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. తాజాగా శనివారం ఉదయం కొందరు వ్యక్తులు తమ ప్లాట్లలోకి ప్రవేశించి బ్లూ షీట్లు ఏర్పాటు చేశారని ప్లాట్ యజమానులు ఆరోపించారు. దీంతో తమ ప్లాట్లలోకి వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. గతంలో కూడా తమ ప్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఆ సమయంలో సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలంగా తమ జోలికి రాలేదని సొసైటీ సభ్యులు తెలిపారు. అయితే తాజాగా మరోసారి తమ భూముల్లోకి ప్రవేశించి ఆక్రమణకు ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఆస్తులకు రక్షణ కల్పించడంతో పాటు, తమ అనుమతి లేకుండా ప్లాట్లలోకి ప్రవేశించి షీట్లు ఏర్పాటు చేసిన సి. కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలత తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీసులను ప్లాట్ యజమానులు కోరారు. ఈ వ్యవహారంలో భూములపై అసలు హక్కులు ఎవరికి ఉన్నాయి, సర్వే నంబర్లకు సంబంధించిన రికార్డులు ఏమిటి, ప్లాట్లలో షీట్లు ఎవరు ఏర్పాటు చేశారు, అనుమతులు లేదా ఇతర చట్టపరమైన పత్రాలు ఉన్నాయా అనే అంశాలపై పోలీసుల దర్యాప్తుతో స్పష్టత రావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.