- చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- 400కు పైగా సినిమాల్లో నటించి అభినయంతో మెప్పించిన దిగ్గజ తార
- వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో 94 ఏళ్ల వయసులో కన్నుమూత
ఇంటర్నెట్ డెస్క్ : భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుతమైన పాత్రలతో సుదీర్ఘకాలం ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తీవ్ర విషాదం అలుముకుంది. షావుకారు జానకి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.


