Wednesday, October 14, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఆరోగ్యoవిజ్ఞాన్ కళాశాల, స్ఫూర్తి ఆర్గనైజేషన్ల సామాజిక సేవ

విజ్ఞాన్ కళాశాల, స్ఫూర్తి ఆర్గనైజేషన్ల సామాజిక సేవ

📰 Generate e-Paper Clip

  • ఉచిత వైద్య శిబిరం.. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ
  • కొర్రెములలో కామినేని హాస్పిటల్స్ వైద్య శిబిరం
  • మారుతున్న జీవనశైలితో పెరుగుతున్న వ్యాధులు
  • ఉచిత వైద్య సేవలను వాడుకోవాలని పిలుపు

ఘట్కేసర్, (ప్రభంజనం):

పర్యావరణ మార్పులు, మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. కొండాపూర్ విజ్ఞాన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, స్ఫూర్తి ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఎల్.బి.నగర్ కామినేని హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ శిబిరాన్ని మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ అప్పారావు నాయుడు, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో కామినేని ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సుధ, ఆర్థోపెడిక్ డాక్టర్ మోక్సిత, జనరల్ ఫిజిషియన్లు సమంత, కార్తిక్ ల బృందం గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరం అనంతరం విజ్ఞాన్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు బృందాలుగా ఏర్పడి కొర్రెముల గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పలు సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసి బొడ్డు వినోద నాగార్జున, మాజీ ఉపసర్పంచులు కందుల రాజు, బొడ్డు నాగార్జున, మాజీ వార్డు సభ్యులు దయ్యాల అంజనేయులు, ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు, ప్రధాన కార్యదర్శి కంది సత్యనారాయణ, సభ్యులు పరుశరాం, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీలత, కామినేని హాస్పిటల్ మార్కెటింగ్ అధికారి బాలకృష్ణ, వైద్యులు గైనకాలజిస్ట్ సుధ, ఆర్థోపిడిక్ మోక్సిత, జనరల్‌ ఫిజిషియన్ సమంత, కార్తిక్, నాయకులు తరిణే మహేంద్ర చారి, మాటూరి రవి, నర్సింహా ఎన్ఎస్ఎస్ కో-అర్డినేటర్లు చంద్రశేఖర్, చంద్రశేఖర్, రమ్య, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.